Hyd Rain | హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, మధురానగర్, బోరబండ, యూసుఫ్‌నగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, మెహదీపట్నం, లంగర్‌హౌస్, కార్వాన్, గోల్కొండ, జియాగూడ ప్రాంతాల్లో వర్షం పడింది. ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్ కూకట్పల్లి, హైదర్‌నగర్, వివేకానందనగర్, హిమాయత్‌నగర్, కోఠి, సుల్తాన్ బజార్, బషీర్‌భాగ్, కాప్రా, చందానగర్, మూసాపేట, బేగంపేట, మల్కాజ్గిరి, కాప్రా, ముషీరాబాద్, మెహదీపట్నం, గోషామహల్, మలక్‌పేట, చార్మినార్, సరూర్‌నగర్, గాజులరామారం, తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కేవలం గంట నుంచి గంటన్నర సమయంలోనే కుండపోత వర్షం పడింది. అత్యధికంగా అత్యధికంగా షేక్‌పేట11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది.
కుత్బుల్లాపూర్ పరిధిలోని మహదేవపురంలో 10.7, కూకట్పల్లి రాజీవ్‌గృహకల్పలో 8.2, ద్వారకానగర్ 8.7, ఆదర్శనగర్ 6.8, మూసాపేట 7.1, బాలానగర్ 7.5, రహమత్‌నగర్ 6.6, యూసుఫ్‌గూడ 10.2, అమీర్‌పేట మైత్రివనంలో 8.3, ఖైరతాబాద్ 8.8, వెంకట్రావ్‌నగర్ కాలనీ 77.7, ఆసిఫ్‌నగర్‌లో 7.5, ఖైతరాబాద్‌లో 7.9, నాంపల్లి ఎల్బీస్టేడియం పరిసరాల్లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. వర్షాలతో హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజ్‌భవన్ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోయింది. మరో వర్షం కారణంగా హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. బంజారాహిల్స్ రోడ్12లో విరించి సిగ్నల్ వైపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గంట సమయం నుంచి వాహనాలు అడుగు కూడా కదలలేదు. వర్షంతో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.