హైదరాబాద్‌లో కుండపోత వర్షం
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. గత వారం రోజుల క్రితం నగరాన్ని వర్షం ముంచెత్తిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తింది. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొట్టింది. ఉదయం 12 గంటల నుంచి వీర కొట్టుడు కొడుతోంది. ఆకాశానికి చిల్లులు… కాదు కాదు.. పెద్ద బొక్క పడ్డట్లు కుమ్మరిస్తూనే ఉంది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, సోమాజిగూడ, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, కోఠి, అఫ్జల్ గంజ్, జియగూడ, లంగర్‌హౌజ్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, టోలిచౌకీ, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రహదారులపై వరద నీరు చేరడంతో కీలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయ్యింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరించారు. రాత్రిలోపు మరోసారి అతి భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.















లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నిండు కుండలా నాగార్జున సాగర్.. 10 గేట్లు ఎత్తివేత
Traffic Restrictions | నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
అసలేంటి.. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్టులు.. వీటిని వాతావరణ శాఖ ఎలా జారీ చేస్తుంది?
Rain Alert | తెలంగాణలో రెండు రోజులు భారీ వానలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

