మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 28, 2020 , 00:42:15

‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం’

‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం’

బంజారాహిల్స్‌: ఆరోగ్యకరమైన జీవన విధానంతో పాటు సరైన వ్యాయాయంతో గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుకోగలమని కార్డియాలజకిల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) తెలంగాణ చాఫ్టర్‌ అధ్యక్షుడు డా.కేఎంకే రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 29న వరల్డ్‌ హార్ట్‌ డే  సందర్భంగా ఆదివారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అత్యధిక మరణాలు కార్డియో వాస్క్యులర్‌ డిసీజెస్‌(సీవీడీ) కారణంగానే సంభవిస్తున్నాయన్నారు. వీటిలో పొగాకు వినియోగం ద్వారా సంభవించే మరణాలు 6 మిలియన్లదాకా ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. కొలెస్ట్రాల్‌, మధుమేహం వల్ల గుండెవ్యాధులను మరింతగా పెంచుతాయని, రక్తపోటు కారణంగా మరణాలు అధికమవుతున్నాయన్నారు. తెలంగాణ చాఫ్టర్‌ గౌరవ కార్యదర్శి డా.రాజీవ్‌, అధ్యక్షుడు  డా.నరసరాజు, కోశాధికారి డా.శ్రీధర్‌రెడ్డితో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


logo