హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): భారత్‌ను ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలపాలంటే ఆవిషరణ, మౌలి క సదుపాయాలు, సమ్మిళిత (3ఐ) సూత్రాల ను అనుసరించాలని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. 3ఐ మంత్రంతోనే తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని టీహబ్‌లో డిప్లొమాటిక్ ఔట్రీచ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొ ని, ప్రసంగించారు. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన తెలంగాణ.. ఎనిమిదేండ్లలోనే గణనీయ వృద్ధిని సాధించిందని తెలిపారు. 2014 లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండగా, 2022 నాటికి రూ.11.55 లక్షల కోట్లకు చేరిందని, పర్ క్యాపిటా ఇన్‌కం 2014 లో రూ.1,24,104 కోట్లు ఉండగా, ప్రసుత్తం రూ.2,80,833 కోట్లుగా ఉన్నదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఐటీ, పారిశ్రామిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయనున్నట్టు వివరించారు. ఫార్మాస్యూటికల్ హబ్, బయోసైన్స్ హబ్‌గా తెలంగాణ నిలిచిందని తెలిపారు.
ఏరోస్పేస్ రంగంలో ఎంతో పురోగతి ఉన్నదని, అమెరికా అధ్యక్షుడు వినియోగించే హెలికాప్టర్ విడిభాగాలను ఇక్కడే తయారు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లో 1,500కు పైగా బహుళజాతి కంపెనీలు ఉన్నాయని, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు అమెరికా తర్వాత హైదరాబాద్‌లో రెండో శాఖను ప్రారంభించాయని గుర్తుచేశారు. టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు జారీ చేస్తున్నట్టు వివరించారు.
గత ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై దౌత్యవేత్తలకు మంత్రి కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచిందని నొక్కి చెప్పారు. దేశంలోనే అత్యంత సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను తెలంగాణ నిర్మించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ పేరుతో రూపొందించిన వర్చువల్ మస్కట్, చాట్ బోట్‌ను మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పరిశ్రమలు, వాణిజ్యశాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 దేశాల దౌత్యవేత్తలు, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సుల్ జనరల్స్, హైకమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు, ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ వర్ధన్‌రెడ్డి, పలు రంగాల డైరెక్టర్లు పాల్గొన్నారు. సమావేశానంతరం టీహబ్ సీఈవో ఎం శ్రీనివాస్‌రావు.. టీహబ్ 2.0 విశేషాలు, మౌలిక వసతులను దౌత్యవేత్తలకు వివరించారు.