జూబ్లీహిల్స్, మే 13: యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని యూసుఫ్గూడా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా అన్నారు. డ్రగ్స్ మహమ్మరిని సమాజం నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC), హైదరాబాద్ సిటీ పోలీస్ సమ్యుక్తాధ్వర్యంలో డ్రగ్స్ అవేర్ నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సీఎన్రెడ్డి మాట్లాడుతూ.. బాల్యంలోనే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. తలిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన పరిశీలిస్తూ చెడు అలవాట్లకు గురికాకుండా, మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ యూసీడీ, డీపీఓ వెంకట కిషన్ రావు, హెచ్సీఎస్సీ ప్రాజెక్టు మేనేజర్ సత్యనారాయణ, వలంటీర్లు రవి శంకర్, శిరీష రెడ్డి, క్యూర్ ట్రైనర్లు ఎస్.సుధాకర్, మధుసూదన్ రెడ్డి, మహిళా సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.