డేటా చోరీలో హవాలా సొమ్ము
డేటా చోరీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వివిధ రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులకు సంబంధించిన డేటాను చోరీ చేయడంతో పాటు వాటిని ఇతర సంస్థలు, వ్యక్తులకు విక్రయించే క్రమంలో పెద్ద ఎత్తున హవాలా ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
- మూడో రోజూ కొనసాగిన విచారణ
- డేటా లీక్‌కు సహకరించిన సంస్థలపై సిట్ ఆరా
సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : డేటా చోరీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వివిధ రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులకు సంబంధించిన డేటాను చోరీ చేయడంతో పాటు వాటిని ఇతర సంస్థలు, వ్యక్తులకు విక్రయించే క్రమంలో పెద్ద ఎత్తున హవాలా ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి, డేటా చోరీ కేసుపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసుల ద్వారా సేకరిస్తున్నట్లు సమచాచారం.
మరో పక్క సైబరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) డేటాను నిందితులకు లీక్ చేసిన సంస్థలు, వ్యక్తులపై ఆరా తీసినట్లు తెలిసింది. 5రోజుల కస్టడీలో భాగంగా ప్రధాన నిందితులైన నితీశ్ భూషణ్, సుశీల్ తోమర్, అతుల్ ప్రతీప్సింగ్, సందీప్‌పాల్, జియా ఉర్ రహమాన్‌లను మూడో రోజు సిట్ అధికారులు విచారించారు. బ్యాంక్ ఆప్ బరోడా, ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పాటు యాక్సెస్, హెచ్డీఎఫ్సీ తదితర ప్రైవేటు బ్యాంకుల నుంచి నిందితులకు డేటా వచ్చినట్లు తేలడంతో ఆయా సంస్థల నుంచి డేటా లీక్‌కు పాల్పడింది ఎవరు? వారికి ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించారు ? డేటాను ఏయే పద్ధతిలో నిందితులకు చేరింది తదితర అంశాలపై సిట్ అధికారులు కూపీ లాగినట్లు సమాచారం.
డేటా నేరుగా ఆయా సంస్థల నుంచి నేరస్తులకు చేరిందా లేక వేర్వేరు మార్గాల ద్వారా చేరిందా అనే కోణంలో కూడా అధికారులు నిందితులను విచారిస్తున్నట్లు తెలిసింది. డేటా చోరీ ముఠా వెనక ఇంకా ఎంత మంది ఉన్నారు, ఏయే సంస్థలు పనిచేస్తున్నాయి తదితర ప్రశ్నలను అధికారులు సంధించినట్లు తెలిసిది. డేటా చోరీలో జరిగిన క్రయ, విక్రయాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై సిట్ అధికారులు లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు తాజాగా కేసు కూడా నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

