ఉద్యోగం కోసం వస్తే.. తన కోరిక తీర్చమంటూ వాట్సాప్ చాటింగ్‌లతో ఓ వ్యక్తి.. యువతిని వేధించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ యువతి(25) జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని ఓ సంస్థకు ఇటీవల పనిమీద వచ్చింది. అక్కడ గతంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన సుమంత్.. ఆ యువతిని పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పగా.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె ఫోన్ నంబర్ తీసుకుని.. వాట్సాప్ చాటింగ్‌లు ప్రారంభించాడు. ఉద్యోగం పేరుతో అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు తన కోరిక తీరుస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో బాధిత యువతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.