సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీ రామారావుకు సామాజిక మాధ్యమాల్లో పుట్టినరోజు వేడుకల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘యంగ్ అండ్ డైనమిక్ లీడర్.. ఇండియన్ ఐటీకి బ్రాండ్ అంబాసిడర్, యువనాయకుడు రామన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, విజన్ ఉన్న దీర్ఘదర్శి.. తెలంగాణకు మార్గదర్శి అంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల బర్త్‌డే విషెస్‌తో సోమవారం సోషల్ మీడియా గులాబీమయమైంది. ‘మన రామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ పోస్టులు పెడుతూ హోరెత్తించారు. ఈ సందర్భంగా కొంతమంది మంత్రి కేటీఆర్‌తో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేగాకుండా అమెరికాను విడిచి తెలంగాణ ఉద్యమంలో మమేకం కావడం కోసం తిరిగి సొంతనేలకు అడుగుపెట్టి.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పోరాడి గెలిచాడని ట్వీట్లు చేశారు. ఇవేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాల్లో డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ సాధించిన పనులను పోస్ట్ చేస్తూ.. తమ స్నేహితులకు ట్యాగ్ చేశారు. ‘తండ్రికి తగ్గ తనయుడు.. మా రామన్న’ అంటూ పోస్టులు, రిప్లేలతో సామాజిక మాధ్యమాలు మార్మోగాయి. ఇక పలు ప్రాంతాల్లో కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన సామాజిక, సేవా కార్యక్రమాలతోపాటు భారీ ఎత్తున కేక్‌లు కట్ చేశారు. ఆయా విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. అత్యంత వినూత్నంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మరికొందరు తమ సూక్ష్మకళతో రాగి ఆకుపై కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ.. సోషల్ మీడియాలో సైతం పోస్టులు చేశారు.