Guppedu Gandham | తెలుగు యూనివర్సిటీ, జులై 10 : సమాజంలోని అంశాలను, అనుభవాల సారాన్ని గుప్పెడు గంధం కవితా సంపుటిగా రూపొందించిన రచయిత రావుల పుల్లాచారి కృషిని వక్తలు ప్రశంసించారు. ప్రముఖ రచయిత రావుల పుల్లాచారి రచించిన గుప్పెడు గంధం కవితా సంపుటి ఆవిష్కరణ సభ రెడ్ హిల్స్‌లో గల రమణాచారి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగింది. కథా సంపుటిని ఆవిష్కరించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి రమణాచారి మాట్లాడుతూ కవితా సంపుటిలోని పలు కథలు తన మనోభావాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కథలలో తన విద్యార్థి జీవితాన్ని చూసుకునాన్ని అన్నారు. సమాజానికి మంచి సాహిత్యాన్ని అందిస్తున్న పుల్లాచారి మరిన్ని రచనలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.
సభాధ్యక్షులు కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్ మూర్తి మాట్లాడుతూ.. కాలంతో మమేకమై పుల్లాచారి రచనలు చేశారని అన్నారు. కాళోజి నారాయణరావు పురస్కార గ్రహీత, పద్మ విభూషణ్ డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ ఈ సందర్భంగా కథా సంపుటిని సమీక్షించారు. ద్రావిడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ పులికొండ సుబ్బాచారి, ఆచార్య జయశంకర్ ఉత్సవ కమిటీ కన్వీనర్ ఎం దయానంద చారి, విశ్రాంత పోలీసు అధికారి పెద్దూరి వెంకట దాసు పాల్గొన్నారు.