హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రూప్ 1 పరీక్షల (Group-1 exam ) ను నెల రోజుల పాటు వాయిదా వేయాలని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సంఘాల నాయకులతో కలసి ఆర్.కృష్ణయ్య శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
జూన్ 9న గ్రూప్ 1, హెచ్ఎల్ఎల్, ఐబీ పరీక్షలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకే రోజు ఇవన్ని పరీక్షలు ఉన్న దృష్ట్యా గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నిరుద్యోగులలో వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పరిపాలన స్థంభించి పోతుందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth reddy) ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ప్రజా ప్రతినిధులారా గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయకుంటే ప్రజాప్రతినిధులను నిలదీస్తామని హెచ్చరించారు. సమావేశంలో ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్ , నాయకులు ఎండి అన్వర్, బీసీ నేత అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.