సిటీబ్యూరో, ఏప్రిల్ 17 ( నమస్తే తెలంగాణ ): ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో శుక్రవారం గ్రూప్ -1 అభ్యర్థుల ధర్నా జరగనున్నది. అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై గళం ఎత్తనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ -1 అభ్యర్థులు తరలిరావాలని నిర్వాహులు పిలుపునిచ్చారు.
గ్రూప్ -1 తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ..పేపర్ వాల్యూయేషన్ సరిగ్గా చేయలేదని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని ఇప్పటికే అభ్యర్థులు నిరసనలు, ర్యాలీలతో తమ డిమాండ్లను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.