మణికొండ, మే 3: ప్రముఖ నటి, బిగ్బాస్ ఫేమ్ హిమజ చేతుల మీదుగా హైదరాబాద్ మణికొండలో గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ యమున, విజయ్ తో పాటు ఏపీ, తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. గ్రీన్ ట్రెండ్స్ బ్రాండ్ వ్యాల్యూ, క్వాలిటీ మేకోవర్ ను మణికొండ వాసులకు ఈ ఫ్రాంచైజీ అందించబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో హెయిర్ అండ్ స్టైలింగ్ ఇక్కడ అందుబాటులో ఉండనుంది.
మణికొండలో గ్రీన్ ట్రెండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంచైజీలు బాగా నడుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ, ఏపీలో దాదాపు వంద వరకు తమ ఫ్రాంచైజీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
మణికొండ గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ యమున మాట్లాడుతూ.. ‘మా గ్రీన్ ట్రెండ్స్ బ్రాంచ్ ను మణికొండలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ రోజు మా ఫ్రాంఛైజీ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన హిమజ గారికి థ్యాంక్స్. మేము ఎన్నో కంపెనీలను చూశాం. కానీ గ్రీన్ ట్రెండ్స్ మాకు బాగా నచ్చింది. వారు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి విషయంలోనూ అందుబాటులో ఉన్నారు. మా గ్రీన్ ట్రెండ్స్ కు వచ్చేవారికి కంప్లీట్ మేకోవర్ హై క్వాలిటీతో ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం.’ అని అన్నారు.
మణికొండ గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ విజయ్ మాట్లాడుతూ.. ‘ ఈ రోజు మా ఫ్రాంఛైజీ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన హిమజకు కృతజ్ఞతలు. ఆమెది మంచి హ్యాండ్. గ్రీన్ ట్రెండ్స్ ఎంత ప్రసిద్ధి చెందిందో మీకు తెలుసు. ఇక్కడ మణికొండ వాసులకు మా ఫ్రాంఛైజీ ద్వారా గ్రీన్ ట్రెండ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. గ్రీన్ ట్రెండ్స్ సంస్థ మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు.’ అని అన్నారు.
నటి హిమజ మాట్లాడుతూ.. ఇప్పుడున్న సొసైటీలో అందంగా కనిపించేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా హెయిర్ నుంచి ప్రతి విషయంలో అందంగా ముస్తాబై వెళ్తున్నారు. అలాంటి మీకు గ్రీన్ ట్రెండ్స్ ది బెస్ట్ ఆప్షన్ అని అన్నారు