Governor Jishnu Dev Varma | బేగంపేట్, జూలై 11 : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన సతీమణి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం గవర్నర్ సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం పట్టు వస్త్రాలు అమ్మవారికి గవర్నర్ సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, దేవదాయ శాఖ కమిషనర్ ఐ వెంకటరావు, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి గవర్నర్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ రాకతో నార్త్ జోన్ డిసిపి రష్మి పెర్మల్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.