సిటీబ్యూరో, నవంబరు 5 (నమస్తే తెలంగాణ ) : పెండింగ్ బకాయిలు చెల్లించాలన్న కాంట్రాక్టర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. గత శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులు రెండు సంవత్సరాలు దాటిన ఇవ్వ డం లేదని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దరిమిలా స్వరం పెంచిన కాంట్రాక్టర్లపై ఒత్తిళ్లు పెంచిం ది. సర్కారుపైనే నోరు మెదుపుతారా? అం టూ విజిలెన్స్ విచారణ పేరిట బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నది. ఫేక్ బిల్లులు పెట్టారని, విచారణ చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం అడిషనల్ ఎస్పీ ఏడుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు పంపారు.
కాంట్రాక్టర్లు ఎస్.భాస్కర్‌రావు, జి. రాంమోహన్, బి. రఘువీర్ రావు, జీఎస్కె కంపెనీ, జి. సాయి కిరణ్, పట్నం శ్రీశైలం, గాజుల భాస్కర్లకు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఇందు లో ఎస్. భాస్కర్‌రావు, పట్నం శ్రీశైలం , గాజుల భాస్కర్లు సంబంధిత బిల్లులను సబ్మిట్ చేయకుండానే ఫేక్ బిల్లులు పెట్టారంటూ నోటీసులు పంపడంపై సదరు కాం ట్రాక్టర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కొంద రు ఒత్తిళ్ల మేరకు కావాలనే అధికారులు విజిలెన్స్ విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని బాధిత కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు సబ్మి ట్ చేయకముందే ఎలా ఫేక్ బిల్లు అని నిర్ధారిస్తారని? అసలు ఎన్నికల పనులంటే ఐఏఎస్, పోలీసులు, ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో, సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే డీఆర్సీ సెంటర్లు, టెంట్‌హౌజ్, ఎలక్ట్రికల్ సామగ్రి, ఫుడ్ సరఫరా ఇతర ఏర్పాట్లు జరుగుతాయని కాంట్రాక్టర్లు తెలిపారు.
గత శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే ఉప ఎన్నికల్లో మా సత్తా చాటుతామని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు కొందరు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే.. సంవత్సరాల తరబడి అధికారులు కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్స్ (జీహెచ్ఎంసీ-టీఎస్‌ఎల్‌ఏ -2023) సంబంధించిన 2023 శాసన సభ ఎన్నికలకు 273 మంది పనిచేశారని, 2023 అక్టోబర్ 20 నుంచి పోలింగ్ బూత్ లు, డీఆర్సీ సెంటర్లు, స్ట్రాంగ్ రూంలు, ఫొ టోగ్రఫీ, ఎలక్ట్రికల్ అరేంజ్మెంట్స్, ఫుడ్, లేబర్ సఫ్లైయి, ట్రాన్స్‌పోర్టేషన్, టెంట్ సామ గ్రి, టేబుల్స్, కుర్చీలు వంటి ఎలక్షన్ సంబంధిత పనులు చేశారు.
2024 డిసెంబర్ 5న రూ.27.50 లక్షల పేమెంట్ ఆర్డర్ ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారని, 2025లో కేవలం రూ.11.25 లక్షలకే టోకెన్స్ జనరేట్ చేసి ట్రేజరికి పంపగా, పూర్తి స్థాయిలో బిల్లులు మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలోనే చేసిన పనులకు ఇప్పటికే సొం తంగా డబ్బులు చెల్లించుకొని వాటికి వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడుతున్నామని, వెం టనే బకాయిలు చెల్లించాలని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముగింట ఆడిగితే విజిలెన్స్ పేరిట ఇబ్బందులు పెట్టడం ఎంత వరకు సమంజసమని సదరు కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. చేసిన పనులపై ఒత్తిళ్లు పెంచడం పట్ల కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.