సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మన అంతిమ లక్ష్యం ఉద్యోగాన్ని సాధించడమే అయినప్పుడు నిరాశపడకుండా మరింతగా ప్రిపేర్ అవుదామని ప్రిలిమ్స్ క్వాలిఫయర్, ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్ బేతి మధు పేర్కొన్నారు. అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ.. నిబద్ధతతో నియామకాలు చేపట్టిన చరిత్ర టీఎస్పీఎస్సీది. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరితం ఆత్మైస్థెర్యంతో ముందుకుసాగక తప్పదు అని డాక్టర్ బేతి మధు పేర్కొన్నారు.
నమస్తే: ప్రిలిమ్స్‌కు ఎట్లా ప్రిపేర్ అయ్యారు?
బేతి మధు : నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యాను. దొరికిన ప్రతి సమయం సబ్జెక్టులను వడపోశాను. మెయిన్స్‌కు అర్హత కూడా సాధించాను. మెయిన్స్‌కు కూడా పూర్తిస్థాయిలో సిద్ధం అవుతున్నాను.
నమస్తే: మళ్లీ ప్రిపేర్ అవుతారా?
బేతి మధు : ఇబ్బందులు ఎదురైనా, తప్పకుండా మళ్లీ ప్రిపేర్ కావాల్సిందే. ఉద్యోగం సాధించే వరకూ విశ్రమించేది లేదు. క్వాలిఫై కానివారికి ఇదో గోల్డెన్ అవకాశం. మెయిన్స్ ప్రిపరేషన్ అయ్యేవాళ్లుకు మరింత పటిష్టంగా సిద్ధమవ్వాల్సిందే. గతంలో జరిగిన విషయాలను ఎక్కువగా ఆలోచించకుండా, భవిష్యత్తుపైనే దృష్టి పెట్టాలి. గతాన్ని తలుచుకొని కూచుంటే సమయం వృథాతోపాటు భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి పాజిటివ్‌గా ఆలోచిస్తూ.. మల్లొక్క సారి ప్రయత్నించాల్సిందే.
-డాక్టర్ బేతి మధు