కందుకూరు : కుల వృత్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో గ్రామాల్లో తిరిగి వారి ఇబ్బందులను తెలుసుకున్న ఆయన అధికారంలోకి వచ్చిన అనంతరం దశాల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.
బుధవారం మండల పరిధిలోని విశ్వకర్మలు మంత్రిని కలిసి ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. అదే విధంగా గౌడ సంఘం నాయకులు కూడా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ పేదల పక్షాపాతి అని చెప్పారు. అన్ని కులాల వారికి న్యాయం చేస్తారని చెప్పారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి,నియోజకవర్గం యూత్ వింగ్ వర్కింగ్ ప్రసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియ కన్వీనరు బొక్క దీక్షిత్‌రెడ్డి, కాసోజు ప్రశాంత్‌చారి, విశ్వ బ్రహణ సంఘం నాయకులు శివలింగా చారి, బాలనర్సింహ చారి, , గౌడ సంఘం నాయకులు ఆనేగౌని దామోదర్‌గౌడ్, సౌడపు శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.