శంషాబాద్ రూరల్, జనవరి 7 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని శంషాబాద్ ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ చంద్రశేఖర్, వ్యవసాయశాఖ అధికారి కవిత ఆధ్వర్యంలో రైతు బంధు పథకం రూ. 50 వేల కోట్లు దాటడంతో సంబురాలు నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గు ల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పంటల పెట్టుబడికి సాయం చేయాలని ఆలోచనతో రైతు బంధు పథకాన్ని ప్రారంభించారన్నారు. వైస్ ఎంపీపీ నీలంనాయక్, మండల రైతు సమన్వయ సంఘం కన్వీనర్ గాదె రాజశేఖర్,మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్‌పాషా, వార్డు సభ్యులు గిరి, ఉదయ్‌గౌడ్, శ్రీశైలంయాదవ్ పాల్గొన్నారు.
హమిదుల్లానగర్లో
హమిదుల్లానగర్ గ్రామంలో సర్పంచ్ సతీశ్‌యాదవ్ ఆధ్వర్యంలో రైతు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు పంటపెట్టుబడికి ఫైసలు లేక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకొని వాటిని తీర్చలేక అనేక ఇబ్బందులు పడేవారన్నారు. ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 5వేలు అందజేస్తున్నారన్నారు. రైతు సమన్వయ సంఘం గ్రామ అధ్యక్షుడు యాదయ్య, ఉప సర్పంచ్ మాధవియాదగిరి, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, వార్డు సభ్యులు పరమేశ్, సురేందర్, ఓంరెడ్డి, నక్కసాయి కుమార్, శ్రీకాంత్, గ్రామ అధ్యక్షుడు అశోక్‌యాదవ్ త దితరులు పాల్గొన్నారు.