సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఎల్లప్పుడు ఉద్యోగులకు అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగిన ఎన్నికలలో జలమండలి గుర్తింపు కార్మిక సంఘం (టీఆర్ఎస్ అనుబంధం) అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన రాంబాబు యాదవ్ సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తలసాని వారికి సూచించారు.