Job Mela in Hyderabad | ప్రయివేటు రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా..? ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? మెడికల్ రంగంలో రాణించాలనుకుంటున్నారా..? అయితే ఆలస్యం ఎందుకు.. ఈ నెల 27న హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించే జాబ్ మేళాకు హాజరవ్వండి. ఉద్యోగం పొందండి.
ఈ నెల 27వ తేదీన నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో దక్కన్ బ్లాస్టర్స్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 70 కంపెనీలు పాల్గొననున్నాయి. ఐటీ కంపెనీలు, బ్యాంకులు, అకాడమిక్స్, హోటల్ మేనేజ్మెంట్, మెడికల్‌తో పాటు ఇతర సెక్టార్లలో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న నిరుద్యోగులు.. జాబ్ మేళాకు అటెండ్ అవొచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8374315052 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా నేరుగా జాబ్ మేళాకు మీ రెజ్యూమ్‌తో హాజరు అవొచ్చు.