హిమాయత్‌నగర్: తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారమంటూ.. మోసం చేసిన గోల్డ్ మ్యాన్‌గా పేరొందిన సూర్యాబాయ్ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ జిల్లా కమల ఈస్ట్నగర్లో ఉంటున్న వేగ్రోజ్ కృష్ణాచారి నవీన్ సింగ్ అనే వ్యక్తితో కలిసి హిమాయత్‌నగర్‌లోని ఎన్ఎస్ జ్యువెల్లరీ దుకాణం నడుపుతున్నాడు. భీమేశ్వరచారి అనే వ్యక్తి సూచన మేరకు సూర్యాబాయ్ అలియాస్ గోల్డ్ మ్యాన్(34)ను కృష్ణాచారి కలిశారు. అతడు 1 కిలో బంగారం అందుబాటులో ఉందని, దానికి రూ.1కోటి 50 లక్షల ధర నిర్ణయించినట్లు చెప్పి.. కొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశాడు. సూర్యాబాయ్ రూ. 27 లక్షల నగదుతో పాటు రూ.5లక్షల 30వేల విలువైన బంగారు ఆభరణాలను తీసుకున్న తరువాత ..కిలో బంగారాన్ని ఇవ్వకుండా మోసం చేశాడు. నారాయణగూడ పోలీసులు సూర్యాబాయ్ని అరెస్టు చేశారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు.