వ్యవసాయ యూనివర్సిటీ ,(హైదరాబాద్) ఏప్రిల్ 29: దేశంలోని చౌడు భూముల్లో ఇక బంగారు పంటలు పండించవచ్చని కాసా చైర్మన్ ఆర్ఎస్ పరోడా అన్నారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ వర్సిటీ రైస్ రీసెర్చ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 60వ డైమండ్ జూబ్లీ ఆన్సర్ రైస్ రీసెర్చ్ గ్రూప్ సమావేశంలో శాస్తవ్రేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శాస్తవ్రేత్తల ఆవిష్కారాల కృషి వలన చౌడు భూముల్లోనూ ఇకనుంచి బంగారు పంటలు పండించడం సాధ్యమేనని అన్నారు.
బీపీటీ సాంబమసూరిలో 5204 ఆధారంగా మరో కొత్త వంగడాన్ని, ఎంటీయూ 1010 అనే వెరైటీ నుంచి మరో కొత్త వంగడాన్ని కనుగొని వాటి ద్వారా ఇకనుంచి తొలిసారి దేశంలోని చౌడు భూముల్లోనూ వరి పంటలు పండించడం, అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన సూచించారు. దేశంలో అధికంగా వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యక్ష, పరోక్షంగా 70 శాతం జీవనోపాధి ఉంటుందన్నారు.
వాటిలో సాగులోని వరి ప్రధానంగా అధిక దిగుబడిని ఇచ్చే రకాలను చీడపీడలను తట్టుకొని, మంచి దిగుబడి నిచ్చే రకాలను కనుగొనడం శుభ సూచికమన్నారు. గత పదేళ్లలో తెలంగాణ సాగులో ప్రధానంగా వరిలో మంచి దిగుబడులను తెచ్చి దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిపిందని అదేవిధంగా ఇటీవల కనుగొన్న రెండు రకాలతో మన దేశంతో పాటు, ప్రపంచ దేశాలకు వరిని ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి శాస్తవ్రేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని వీటిపై సుదీర్ఘ చర్చ జరిపారు.