బంజారాహిల్స్,జనవరి 14: గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.. జై శ్రీగోదారంగనాథస్వామికి జై అంటూ భక్తుల తన్మయత్వంతో ఆలయాలన్నీ ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. నెలరోజుల పాటు కొనసాగిన ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అన్ని వైష్ణవ ఆలయాల్లో శ్రీ గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీనగర్‌కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయం, ఫిలింనగర్ దైవ సన్నిధానంతో పాటు ఇతర ఆలయాల్లో గోదా కల్యాణంలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. గోదా కల్యాణం సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మికత నెలకొంది.
భూలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో…
హిమాయత్‌నగర్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగానారాయణగూడలోని శ్రీశ్రీశ్రీ భూలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో గోదాదేవి కల్యాణ మహోత్సవాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మ వారిని పట్టు వస్ర్తాలతో అలంకరించి కల్యాణోత్సవం నిర్వహించారు. గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అన్నసంతార్పణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భూలక్ష్మి ఆలయం కమిటీ వైస్ చైర్మన్ అశోక్ కుమార్,అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ గౌడ్, కేశబోయిన శ్రీధర్,సభ్యులు జ్ఞానేశ్వర్,అర్జున్, శివ,నరేశ్,ఉదయ్, బీఆర్ఎస్ నాయకులు యతిరాజ్, నందు, సర్ఫరాజ్, పాలడుగు శ్రీనాథ్, నవీన్, మహేశ్, శ్రీకాంత్, కాంగ్రెస్ నేత నీలం శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.