Global Education Fair | ఖైరతాబాద్, ఆగస్టు 20 : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల కోసం యూని ఎక్స్పర్ట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం(ఆగస్టు 21) సోమాజిగూడలోని కార్యాలయంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేయిర్ను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఆపరేషన్ హెడ్ ఉమా తెలిపారు. ఈ ఫేయిర్లో 60కి పైగా యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన 60కి పైగా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు హాజరవుతున్నారని, విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్, ప్రాసెసింగ్, స్పాట్ అడ్మిషన్లు, 60 శాతం వరకు స్కాలర్షిప్లు పొందవచ్చన్నారు. యూనివర్సిటీ ఎంపిక, దరఖాస్తు ప్రక్రియ, వీసా గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇతర వివరాలకు 9912328645 నంబరులో సంప్రదించాలన్నారు.