 
                                                            సిటీబ్యూరో: కాంగ్రెస్ గెలిస్తే ఐదొందలకే ప్రతి ఇంటికి సిలిండర్ను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆడబిడ్డలే నిలదీస్తున్నారు. కేంద్రం పంపిణీ చేసే సబ్సిడీతో సంబంధం లేకుండా రూ. 500 మహాలక్ష్మి పథకంలో భాగంగా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ వేలాది మంది మహిళలకు సబ్సిడీ ప్రయోజనాలు అందడం లేదు.
దీంతోనే అభిప్రాయ సేకరణలో భాగంగా ఓ మహిళ మాట్లాడుతూ..‘ఐదొందలకే సిలిండర్ ఇస్తమని చెప్తిరి.. గ్యాసోళ్లు వెయ్యి తీసుకోవట్టే.. పోని మిలిగిన రూ.500 అకౌంట్ల పడుతున్నాయా? అంటే అదీ లేదు. సొంతిళ్లు ఉన్నోళ్లకే మళ్లా ఇండ్లను ఇస్తున్నరు. కనీసం గ్యాస్ బండ సబ్సిడీ పైసలు అయినా అకౌంట్లో ఎస్తలేరు. చేతి నిండా పని లేక ఇల్లు ఎట్ల గడవాలి’ అంటూ తనలాగే ఎంతో మంది మహిళలు గ్యాస్ సబ్సిడీ అందక ఇబ్బంది పడుతున్నారని ఆ మహిళ ఆవేదన చెం దింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
 
                            