సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులకు మేయర్ సాదరంగా స్వాగతం పలికి మొక్కలను అందజేశారు. అనంతరం అధికారులు, స్టాండింగ్ కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమం జరిగింది. స్టాండింగ్ కమిటీకి అత్యంత ప్రాముఖ్యత ఉన్నదని మేయర్ అన్నారు. నిర్మాణాత్మక, ప్రజోపయోగమైన నిర్ణయాలు తీసుకొని నగరాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆవుల రవీందర్రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, కంది శైలజ, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, చింతల విజయశాంతి, పొడవు అర్చన, ఫహ్లాద్ బిన్ అబ్ధుల్ సమద్ బిన్ అబ్దత్, బన్నాల గీత ముదిరాజ్, మన్నె కవితారెడ్డి, మహమ్మద్ ఖాదీర్, మహమ్మద్ నసీరుద్దీన్, మహమ్మద్ ముజాఫర్ హుస్సేన్, రఫత్ సుల్తానా, షహీన్ బేగం, సబీహ బేగం పాల్గొన్నారు.