GHMC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈ నెల 15, 16 తేదీల్లో పశువుల వధ శాలలు, రిటైల్ బీఫ్ దుకాణాలను మూసివేయనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాల మూసివేతకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ అధికారులకు సహకారం అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లను కూడా ఆర్వీ కర్ణన్ కోరారు.