GHMC Mayor | అంబర్‌పేట్‌లో వీధి కుకల దాడిలో మరణించిన బాలుడి తండ్రికి సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రూ. 9,71,900 ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు
సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): అంబర్‌పేట వీధి కుకల దాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి రూ. 9,71,900 ఎక్స్‌గ్రేషియా చెకును అందజేశారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బాలుడి తండ్రి గంగాధర్‌ను పిలిచి ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులతో మేయర్, హైలెవల్ కమిటీ సభ్యులు మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున కూడా అండగా ఉంటామని మేయర్ భరోసా ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులకు, స్లమ్, టౌన్ లెవల్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తున్నట్లు మేయర్ తెలిపారు.
ఇటీవల అన్ని పార్టీల కార్పొరేటర్లు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో జీహెచ్ఎంసీ తరఫున రూ. 6 లక్షలు, మేయర్ తరఫున రూ. 2 లక్షలు, మేయర్ గౌరవ వేతనం 65,000, డిప్యూటీ మేయర్ గౌరవ వేతనం 32,500, కార్పొరేటర్లు బన్నాల గీత రూ. 10,000, బాబా ఫసియుద్దీన్ రూ. 7,800, సామల హేమ రూ. 7,800, మన్నె కవితా రెడ్డి రూ. 8,000, రజిత రూ. 8,000, సోహెల్ ఖాద్రి రూ. 7,800, విజయ్ కుమార్ గౌడ్ రూ. 7,000, వనం సంగీత రూ. 10,000, వి.కవిత రూ. 8000 అందజేసిన మొత్తం రూ. 9,71,900 చెకును డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లతో కలిసి మేయర్ మృతుడి తండ్రి గంగాధర్‌కు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, హైలెవల్ కమిటీ సభ్యులు (కార్పొరేటర్లు) బాబా ఫసియుద్దీన్, సామల హేమ, వనం సంగీత, బన్నాల గీత, శ్రవణ్, సీఎన్.రెడ్డి, కొప్పుల నర్సింహ, పద్మ తదితరులు పాల్గొన్నారు.