సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వ్యాపారులపై జరిమానాల మోత మోగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్‌లను 20లోపు రెన్యువల్ చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించింది. నిర్ణయించిన గడువు లోపు రెన్యువల్ చేస్తే ఎటువంటి పెనాల్టీ ఉండదని స్పష్టం చేసింది.
21 నుంచి వచ్చే ఫిబ్రవరి 19 వరకు 25 శాతం పెనాల్టీ, ఫిబ్రవరి 26 తర్వాత 50 శాతం జరిమానా విధించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పెనాల్టీ లేకుండా రెన్యువల్ ముందుగానే చేసుకోవాలని అధికారులు తెలిపారు.