GHMC | సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై భవన నిర్మాణ వ్యర్థాలు వారికి జరిమానాలు విధిస్తున్నది. సర్కిల్ స్థాయి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీలు భవన నిర్మాణ వ్యర్థాలు వేసే వారిపై దృష్టి సారించింది.
రోడ్ల మీద చెత్త వేసినందుకు ఇప్పటి వరకు సీసీఎంఎస్ ద్వారా రూ. 35 లక్షల జరిమానాలు విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా 270 చలాన్లు విధించగా..రూ. 1.52 లక్షలు, మూసాపేట సర్కిల్లో 82 చలాన్లకు రూ. 7.48 లక్షలు, ఉప్పల్లో 104లకు రూ.1.60 లక్షలు జరిమానాలు వేశారు. మొత్తం 1,445 మందికి జరిమానా విధించగా, రూ. 34.80 లక్షల్లో రూ.11.31 లక్షలు బల్దియాకు చలాన్ల రూపంలో సమకూరింది.