సిటీబ్యూరో: గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500ల నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి రూ. 25 వేల వరకు జరిమానాలు విధిస్తున్నది. సర్కిల్ స్థాయి అధికారులు వివిధ వ్యాపారస్తులు, దుకాణాదారులే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
ఇప్పటి వరకు సీసీఎంఎస్ ద్వారా రూ. 10 లక్షల జరిమానాలు విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్ల మీద చెత్త వేసినందుకు రూ. 5 లక్షల 41వేల ఫైన్ వేసినట్లు చెప్పారు. భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్ల మీద వేసిన 37 మందిని గుర్తించి రూ. 5 లక్షల 50వేలు వేసినట్లు చెప్పారు. శానిటేషన్, టౌన్‌ప్లానింగ్ శాఖలు సంయుక్తంగా కలిసి 259 మంది నుంచి రూ.10 లక్షల జరిమానాలు వేశామన్నారు.