సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ): కాలనీ లేఅవుట్లలోని అన్ని పారులు, ఖాళీ స్థలాల సరిహద్దులను చీఫ్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ విభాగం సమన్వయంతో డిజిటలైజ్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్లతో కలిసి కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలనీ లేఅవుట్లలోని అన్ని పారులు, ఖాళీ స్థలాల సరిహద్దులను డిజిటలైజ్ చేసి జియో ఫెన్సింగ్ చేయాలని తెలిపారు. ప్రతి ట్రీ పారుకు, ఖాళీ స్థలాలకు ప్రత్యేక ఐడీ ఇవ్వాలని తెలిపారు. 2వేల చదరపు గజాల కంటే ఎకువ ఖాళీ ప్రదేశాలను పారులుగా అభివృద్ధి చేయాలన్నారు. పార్ ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని, ఏదైనా ఉల్లంఘనలు జరిగితే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని సరిళ్ల మేనేజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్లు తమ పరిధిలోని పారులను కనీసం నెలకు ఒకసారి సందర్శించి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి పార్ తనిఖీల నివేదిక ఫార్మాట్ ద్వారా ప్రతి నెల 5వ తేదీలోపు అర్బన్ బయోడైవర్సిటీ అదనపు కమిషనర్‌కు నివేదిక సమవర్పించాలని కమిషనర్ తెలిపారు.
పార్ నిర్వహణ గురించి వాకర్స్, స్టేక్ హోల్డర్స్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల సభ్యుల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకొని, సందర్శకుల నుంచి వచ్చిన ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు విడుదల చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పార్ ప్రాంగణంలో ప్లాస్టిక్‌ను నిరోధించడానికి ఒక ప్రతిపాదనను సమర్పించి, దానిని నియంత్రించే పద్ధతులు చేపట్టాలన్నారు. ఇతర శాఖల ద్వారా చెట్ల నరికివేతను సకాలంలో తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. అవసరమైన సాధనాలు, ఇన్ పుట్లను ఉపయోగించి కత్తిరింపు పద్ధతిపై స్పష్టమైన సూచనలను జారీ చేయడానికి అనుబంధ లైన్ డిపార్ట్మెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించాలని తెలిపారు.
సెక్యూరిటీ గార్డుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కమిషనర్ తెలిపారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగం టికెటింగ్, ధర, రాబడి మొదలైనవాటిని పటిష్టమైన పద్ధతులు అనుసరించాలని కమిషనర్ తెలిపారు. రింగ్ ఫెన్సింగ్, ప్లో బ్యాక్ సిస్టమ్ కోసం మెకానిజం అభివృద్ధికి చర్యలు తీసుకుని తద్వారా పార్ అభివృద్ధి నిర్వహణ కోసం ఆదాయాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ తెలిపారు. హరితనిధి కింద వచ్చిన సొమ్మును పారుల్లో పచ్చదనం పెంపొందించేందుకు అటవీ శాఖకు బదులుగా జీహెచ్ఎంసీ వద్ద ఉంచవచ్చా లేదా అనేది దానిపై ఈ సమావేశంలో చర్చించారు. పావురాలకు బహిరంగ ప్రదేశాల్లో తినిపించడం వల్ల పట్టణ ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఇబ్బంది కారణంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, పశు వైద్య విభాగం సంప్రదించి బహిరంగ ప్రదేశాల్లో పావురాల దాణాను వేయకుండా మార్గాలను పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సుభద్ర దేవి, శ్రీనివాసరావు, సునంద రాణి, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, విజిలెన్స్ విభాగం అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీనివాస్, అదనపు కమిషనర్ ఎస్టేట్, సామ్రాట్ అశోక్ , అదనపు కమిషనర్ లేక్స్ శివకుమార్ నాయుడు, జాయింట్ కమిషనర్ ఐటీ పద్మ పాల్గొన్నారు.