Amberpet Flyover | అంబర్పేట, ఫిబ్రవరి 18 : అంబర్పేటలో నిర్మాణంలో ఉన్న ఛే నెంబర్ ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి మంగళవారం ఉదయం పరిశీలించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, ఆర్ అండ్ బి ఈఈ ధర్మారెడ్డి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, సర్కిల్ డీసీ మారుతీ దివాకర్ తదితరులతో కలిసి మొదట గోల్నాక చర్చి నుంచి నడుచుకుంటూ అంబర్పేట ముక్రం హోటల్ వరకు వెళ్లారు. నిర్మాణ పనుల తీరును పరిశీలించారు.
ముక్రం హోటల్ దగ్గర రోడ్డుకు అనుకొని మసీదు ఉండడంతో ఆ రోడ్డు ఇరుకుగా మారింది. మసీదు గోడను తొలగింపు విషయమై మసీదు ప్రతినిధులతో చర్చించాలని, గోల్నాక వద్ద చర్చికి ఎదురుగా ఉన్న గ్రేవ్యార్డు విషయమై కూడా చర్చించాలని ఈఈకి చెప్పారు. ఫ్లైఓవర్ పైకి ఎక్కి కూడా పరిశీలన చేశారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వీలైనంత తొందరగా పనులన్నీ పూర్తి కావాలన్నారు. కమిషనర్ వెంట జీహెచ్ఎంసీ ఈఈ రమేష్, అంబర్పేట సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ కిష్టయ్య, మహేష్, బాబు, ఏఎంఓహెచ్ డా.హేమలత తదితరులు ఉన్నారు.