సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఆస్తులను అధికారులు ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు.. మౌలిక వసతుల కల్పన, మెరుగైన నిర్వహణతో సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకునే వనరులను సైతం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన క్రీడలను సైతం ఖరీదుగా మార్చే నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నారు. ఇప్పటికే సీఎస్ఆర్ పద్ధతిలో మోడల్ మార్కెట్లు, కమ్యూనిటీ హాల్స్‌ను దూరం చేసిన అధికారులు తాజాగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ప్లే గ్రౌండ్లను ప్రైవేట్ వ్యక్తులను అప్పగించాలని నిర్ణయించి ఈ మేరకు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ నిర్వహణకు టెండర్లకు సిద్ధం చేశారు.
ఈ ప్రతిపాదనను నేడు జరిగే స్టాండింగ్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు సమర్పించారు. మేయర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సభ్యులు ప్రైవేట్ పరం చేసే విధానానికి ఆమోదించేందుకు సిద్ధమయ్యారు.. రెండేళ్ల కాలపరిమితితో పది స్పోర్ట్స్ కాంప్లెక్స్, ప్లే గ్రౌండ్లను ప్రైవేట్‌కు అప్పజెప్పేందుకు మార్గం సుగమమం చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత ధరలతో ఏజెన్సీలు ఖరారు చేయనున్నారు. ఇదే జరిగితే పేద, మధ్య తరగతి వర్గాలకు క్రీడలు ఖరీదుగా మారనున్నాయి. క్రీడాభివృద్ధికి కృషి చేయాల్సిన అధికారులు ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుండడం పై అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ప్రైవేట్ పరం అవుతున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు..