సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ ) : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్‌లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీశ్, ఈఎన్సీ జియావుద్దీన్, యాదగిరి రావు, ఉపేందర్ రెడ్డి, శంకరయ్య, వి.కృష్ణ, సరోజ, జయరాజ్ కెన్నడి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఏఎన్సీ సుదర్శన్, సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయక్, సీఈ ప్రాజెక్టు దేవానంద్, సీఈ సురేశ్, జోనల్ కమిషనర్లు వెంకటేశ్ దొత్రే, మమత, శ్రీనివాస్ రెడ్డి, పంకజ, రవికిరణ్, సీపీఆర్వో మహమ్మద్ ముర్తుజా, ఓఎస్డీలు వేణుగోపాల్, రమణ, ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈ భాస్కర్‌రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ మహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.