సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ ) : ప్రజావాణిలో వచ్చిన విన్నపాల పరిష్కారంలో జాప్యం చేయొద్దని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, వేణుగోపాల్, రఘు ప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి, అడిషనల్ సీసీపీ గంగాధర్‌లు నగరం నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో 85 విన్నపాలు రాగా ఆరు జోన్లలో 80 ఆర్జీలను స్వీకరించనట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఇలంబర్తి లేకపోవడంపట్ల అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.