Siripuram Yadayya | ఘనంగా సిరిపురం యాదయ్య వర్ధంతి
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుడు సిరిపురం యాదయ్య మరణం వెలకట్టలేనిదని ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల శేఖర్, తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు మారోజు రామాచారి పేర్కొన్నారు.
ఆర్కేపురం : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుడు సిరిపురం యాదయ్య మరణం వెలకట్టలేనిదని ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల శేఖర్, తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు మారోజు రామాచారి పేర్కొన్నారు. ఆదివారం సిరిపురం యాదయ్య 12వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్కేపురం డివిజన్ తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిరిపురం యాదయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 ఏళ్ల పసి వయసులో తెలంగాణ సాకారం కోసం అమరుడైన సిరిపురం యాదయ్య తెలంగాణ ప్రజల గుండేల్లో స్థిరస్థాయిలో నిలిచిపోతాడని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ళ రామ్ నర్సింహగౌడ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్, సీనియర్ నాయకులు నెంటూరి రవీందర్‌రెడ్డి, న్యాలకొండ శ్రీనివాసరెడ్డి, కొండ్ర శ్రీనివాస్, చిన్నం రమేష్ కుర్మ, సోమేశ్వర్రావు, ఎస్.కె.మహ్మద్, చెన్నగోని శంకర్‌గౌడ్, యూసఫ్, శంకర్, అబ్దుల్ హమీద్, వాజీద్ పటేల్, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
సరూర్‌నగర్‌లో..
తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్య అమరత్వం మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం తరంగా ఫౌండేషన్ చైర్మన్ వెంకట్‌గౌడ్ ఆధ్వర్యంలో సిరిపురం యాదయ్య వర్ధంతి కార్యమ్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీగల కృష్ణారెడ్డి హాజరై యాదయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో తోలి అమరుడైన సిరిపురం యాదయ్య ఆత్మబలిదానం ఎన్నటికీ మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, అయాచితం శ్రీధర్, కొత్త మనోహర్‌రెడ్డి, పుట్టం పురుషోత్తంరావు, పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

