get together | కవాడిగూడ, మే 31: హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 2009- 2010 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఒక్క చోట కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒకరికొకరు పలకరించుకొంటూ యోగక్షేమాలు తెలసుకుకొని ఆనందోత్సాహాలతో గడిపారు.
ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు భ్రమరాంబ, పరిమళ, శ్రీనివాస్, అరుణ, సిద్దేశ్వర్, శ్రీరాజపద్మ, హేమలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు జంగయ్, కిరణ్, రాజు మాట్లాడుతూ.. తామంతా పదిహేను సంవత్సరాల తరువాత ఒక్కచోట కలుసుకోవడంతో అమితమైన ఆనందం కలుగుతుందని అన్నారు. తాము విభిన్న రంగాల్లో స్థిరపడ్డామంటే తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల కృషి ప్రోత్సాహమే కారణమని తెలిపారు.