Ganja | రాజేంద్రనగర్‌లో 92 గంజాయి చాక్లెట్లు.. పాతబస్తీలో 14 కేజీల గంజా సీజ్
హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి (Ganja) పట్టుబడింది. రాజేంద్రనగర్‌లో 92 గంజాయి చాక్లెట్లు పట్టుబడగా, పాతబస్తీలో 14 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి (Ganja) పట్టుబడింది. రాజేంద్రనగర్‌లో 92 గంజాయి చాక్లెట్లు పట్టుబడగా, పాతబస్తీలో 14 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌లోని మొయినాబాద్‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో తోల్‌కట్టా వద్ద ఓ షెడ్డుపై పోలీసులు దాడిచేశారు. అక్రమంగా చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని సౌరబ్ ఖాన్‌గా గుర్తించారు. అతనితోపాటు ముస్తబా అలీఖాన్, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 92 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇక, పాతబస్తీలోని ఉప్పుగూడలో రూ.5 లక్షల విలువైన 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. వారి వద్ద గంజాయి, ఓ కారు, రెండు బైక్‌లతోపాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి విద్యార్థులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితులు శరీష, పద్మతోపాటు శ్రీనివాస్ చారీపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

