హైదరాబాద్ : హైదరాబాద్లోని(Hyderabad) వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఎస్టీఎఫ్(Stf police) పోలీసులు గంజాయిని(Ganja seized )పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హయత్నగర్లో ఓ ఇంట్లో గంజాయి ఉందనే పక్కా సమాచారం మేరకు ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించి 5.070 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో సీఐ శ్రీధర్, ఎస్సై జ్యోతి, హెడ్ కానిస్టేబల్ లేకా సింగ్ , కానిస్టేబుళ్లు వికాస్, రాంచెందర్లు కలిసి ఒక ఇంట్లో గంజాయి దాచి ఉంచారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు.
ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఆర్. తిరుపతి, ఆర్.సాయి కిరణ్, సి. గణేష్ వీర మురళీ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరొక ఘటనలో అప్పర్ దూళిపేట్ ప్రాంతంలోని బలరామ్ గల్లీలో ఇద్దరు మహిళలు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు మహిళల వద్ద 1.4 కేజీలు గంజాయిని పట్టుకున్నారు. శాలిని, రిషి సింగ్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.