దుండిగల్, సెప్టెంబర్ 1 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ.వివేకానంద్‌కు ప్రజలనుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా ప్రజల నుంచి ఆనూహ్య మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే వివేకానంద్‌కు మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజులరామారం సర్కిల్, సూరారం డివిజన్ పరిధి, షాపూర్‌నగర్‌లోని బడే మజీద్ (జమ మజీద్ మహ్మదీయ) కమిటీ శుక్రవారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేస్తామని స్పష్టం చేయడంతో పాటు వివేకానంద్‌ను ఘనంగా సత్కరించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు. ప్రధానంగా విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో ఎన్నో అవకాశాలు కల్పిస్తూ మైనార్టీల్లో పేదరికాన్ని, వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. రానున్న ఎన్నికల్లో వివేకానంద్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్ ప్రభుత్వానికి బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ.మోయిజ్, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ, ఫిరోజ్, మునీర్, అఖిల్, సాజిద్, మజీద్ కమిటీ ముఖ్య సలహాదారులు మహ్మద్ నసీరుద్దీన్, అధ్యక్షుడు అల్తాజ్ షేక్ మహ్మద్, ఉపాధ్యక్షుడు మహ్మద్ అమీర్‌ఖాన్, ప్రధాన కార్యదర్శి ఒమేర్, కోశాధికారి నూర్సాథ్, కార్యదర్శి మక్బూల్, అశ్వక్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.