పోలీసులకూ సైబర్ టోపీ
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో సామాన్యులే కాదు.. నేరాలను అరికట్టాల్సిన పోలీసులూ చిక్కుకుంటున్నారు. ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుళ్లు వారి కుటుంబసభ్యులు, మిత్రులు, సన్నిహితులు.. ఇలా సైబర్ మోసగాళ్ల బారినపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. సాక్షాత్తు ఓ మాజీ ఐపీఎస్ సతీమణి సైబర్ వలలో చిక్కుకున్నారు.
-
డిజిటల్ అరెస్టు, హనీట్రాప్‌తో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
-
ఐపీఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు.. బాధితులే
-
అప్రమత్తం చేయాల్సిన వారే ఉచ్చులో పడుతున్న వైనం
-
ఈ ఏడాదిలో ఐపీఎస్, ఐఏఎస్‌లకు తెలిసిన బాధితులే 60 మంది
-
డబ్బులు వెనక్కి తెప్పించాలంటూ పెద్దస్థాయిలో ఒత్తిళ్లు
-
ప్రాధాన్యత క్రమంలో జాబితాను తయారుచేసిన సైబర్ పోలీసులు!
సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)సైబర్ నేరగాళ్ల ఉచ్చులో సామాన్యులే కాదు.. నేరాలను అరికట్టాల్సిన పోలీసులూ చిక్కుకుంటున్నారు. ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుళ్లు వారి కుటుంబసభ్యులు, మిత్రులు, సన్నిహితులు.. ఇలా సైబర్ మోసగాళ్ల బారినపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. సాక్షాత్తు ఓ మాజీ ఐపీఎస్ సతీమణి సైబర్ వలలో చిక్కుకున్నారు. స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడితే 500 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన నేరస్తులు.. బాధితురాలి నుంచి ఏకంగా రూ.2.58కోట్లు వసూలు చేశారు. ఓ ఇన్స్పెక్టర్ హానీట్రాప్‌లో పడి లక్షలు నష్టపోతే.. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ నుంచి సైబర్ నేరస్తులు రూ. 3 కోట్లు దోచుకున్నారు. మరో అధికారికి పరిచయమున్న వ్యక్తి రూ. 1.5 కోట్లు, సీనియర్ ఐఏఎస్‌కు పరిచయం ఉన్న వాళ్లు రూ. 75 లక్షలు, అదనపు డీజీ స్థాయి పరిచయమున్న డాక్టర్లు రూ. 60 లక్షలు పోగొట్టుకున్నారు. ఇలా వివిధ రూపాల్లో సైబర్‌నేరస్తుల ఉచ్చులో చిక్కి మోసపోయారు.
సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)సైబర్ నేరగాళ్లకు తాము మోసం చేయడానికి ఎంచుకున్న వ్యక్తి ఎవరనేది అవసరం లేదు. వాళ్ల బెదిరింపులకు భయపడుతున్నారా.. ఖాతాల్లో నగదు ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌ల వరకు అధికారులు, వారి కుటుంబసభ్యులు, మిత్రులు, సన్నిహితులు.. ఇలా ఇటీవల సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నవారు చాలామంది ఉన్నారు.
సాధారణంగా గల్లీలో కానిస్టేబుల్ తెలిస్తేనే.. మనం చాలా హడావిడి చేస్తాం.. అటువంటిది పెద్దస్థాయి అధికారులు తెలిసినవారు.. తాము పోగొట్టుకున్న డబ్బులు రాకపోతాయా.. అంటూ వారితో పైరవీలు చేయించినా సాంకేతికంగా అదేదీ సాధ్యపడకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈరకంగా సుమారు రూ.60 నుంచి రూ.70కోట్ల రూపాయలు సైబర్‌నేరగాళ్ల చేతిలో కోల్పోయిన వారు ఉన్నారని పోలీసులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటికే ఇలా పెద్దసార్ల పరిచయాలతో వచ్చిన లిస్టు తయారై ఉన్నదని, ప్రాధాన్యతాక్రమంలో ఇవన్నీ క్లోజ్ చేస్తున్నామని ఒక సైబర్ అధికారి చెప్పారు.
40మందికి పైగా డిజిటల్ అరెస్టుల బాధితులు!
సాక్షాత్తు ఒక మాజీ ఐపీఎస్ సతీమణి సైబర్ వలలో చిక్కుకున్నారు. స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడితే 500శాతం లాభాలు వస్తాయని నమ్మించిన నేరస్తులు బాధితురాలి నుంచి ఏకంగా రూ.2.58కోట్లు వసూలు చేశారు. నగరంలోని ఒక కీలక జోన్లో పనిచేసిన ఇన్స్పెక్టర్ హానీట్రాప్‌లో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు ఆయన భార్య సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత సంవత్సరం ఒక వైద్యురాలు రూ.3కోట్లు పొగొట్టుకున్నారు. ఆమె ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ కాగా.. వారి పరిచయాలతో ఫిర్యాదు చేసినప్పటికీ ఆమె పోగొట్టుకున్న డబ్బులు మాత్రం వెనక్కు రాలేదు. మరో ఐపీఎస్ అధికారికి పరిచయం ఉన్న వ్యక్తి రూ.1.5 కోట్లు, సీనియర్ ఐఏఎస్‌కు పరిచయం ఉన్న వాళ్లు రూ.75లక్షలు, ఒక అదనపు డీజీ స్థాయి పరిచయమున్న డాక్టర్లు రూ.60లక్షలు.. ఇలా డిజిటల్ అరెస్ట్‌లలో పొగొట్టుకున్నారు. ఇలా హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారులకు తెలిసిన వారు 40 మందికి పైగా డిజిటల్ అరెస్టు, పెట్టుబడుల మోసాలు, ఇతర కీలక సైబర్‌నేరాల బాధితులున్నారు. డిజిటల్ అరెస్ట్‌లపై అవగాహన ఉన్న ఐపీఎస్ అధికారులు అవకాశాన్ని బట్టి వాళ్ల కేసుకు ప్రాధాన్యత ఇచ్చి డబ్బులు వెనక్కు వచ్చేలా చేయండంటూ కిందిస్థాయి అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం.

పూర్తి రహస్యంగా దర్యాప్తు!
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన కొందరు బాధితులు తమ గురించి బయటకు చెప్పుకోవడానికి ఒప్పుకోరు. ఈ క్రమంలో వారి పేర్లు పూర్తిగా రహస్యంగా ఉంచుతూనే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. అయితే ఇందులో సినిమా స్టార్లు, పొలిటీషియన్స్, నగరానికి చెందిన బడా వ్యాపారవేత్తలు, డాక్టర్లు ఉన్నట్లుగా తెలిసింది. ఈ రెండేళ్లలో కేవలం హైదరాబాద్‌లోనే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు తెలిసిన వాళ్లు 70 మంది వరకు ఫెడెక్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలలో రూ.60కోట్ల వరకు మోసపోయినట్లుగా పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.. ఐపీఎస్ అధికారులకు సంబంధించిన సిఫారస్లు, తెలిసిన వాళ్లకు సంబంధించిన వారి జాబితాను సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా తయారు చేశారు. ఎప్పుడు ఏ అధికారి నుంచి ఫోన్ వచ్చినా వెంటనే సమాచారం ఇచ్చేలా ఆయా కేసులు, బాధితుల వివరాలు వాటి పక్కనే రెఫరెన్స్ నంబర్లతో ఒక లిస్టు తయారుచేసినట్లు తెలిసింది.
డిజిటల్ అరెస్టులు, హనీట్రాప్ మార్గాల్లో..
ఇదిలా ఉంటే కొంతమందికి వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, హానీట్రాప్లు వంటివి కూడా ఉండటంతో బయటకు చెప్పలేక మానసిక సంఘర్షణను అనుభవిస్తున్నారని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు తమకు తెలిసిన పెద్ద ఆఫీసర్లతో సైబర్ పోలీసు అధికారులకు ఫోన్లు చేయించి రికవరీ మార్గాలు, కేసులు లేకుండా చూడమంటూ చెప్పడం వంటివి జరుగుతున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కీలక కేసులన్నీ డిజిటల్ అరెస్టులు, హనీట్రాప్‌లు, పెట్టుబడుల మీదనే ఎక్కువగా వచ్చాయని, బాధితులకు న్యాయం చేసేందుకు సైబర్ పోలీసులు ప్రయత్నించినా సాంకేతికంగా నేరగాడు డబ్బులన్నీ మ్యూల్ అకౌంట్లలో వేయించుకుని విత్ డ్రా చేస్తే అవి రాబట్టడం కష్టమని సైబర్ అధికారి ఒకరు చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుని ఇప్పటికైనా తాము మోసపోయినట్లు అనిపించిన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేసి ఆ తర్వాత స్వయంగా ఫిర్యాదు చేస్తే తమ దర్యాప్తునకు అనుకూలంగా ఉంటుందని ఆ అధికారి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

