డీజీపీకి నైబర్హుడ్ బాధితుల ఫిర్యాదు
గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలోని నైబర్హుడ్ గేటెడ్ కమ్యూనిటీని నిషేధిత జాబితాలో చేర్చారు.
సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలోని నైబర్హుడ్ గేటెడ్ కమ్యూనిటీని నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో దశాబ్దాల కాలంగా నివాసముంటున్న ఇండ్లకు అన్ని అనుమతులు ఉన్నా.. నిషేధిత జాబితాలో చేర్చి, క్రయవిక్రయాలకు ఆస్కారం లేకుండా చేశారంటూ&బాధితులు డీజీపీని ఆశ్రయించారు. వాస్తవానికి భూమి వారసుల నుంచి బిల్డర్ వద్దకు చేరిందని, చారిత్రాత్మక సీలింగ్ విచారణలు కొనుగోలుదారులకు వెల్లడించారా అన్నది తేలాల్సి ఉందని పేరొన్నారు.
ఈ వ్యవహారంలో మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాల వినియోగం, కుట్ర ఉన్నట్లు తేలితే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 318, 336, 340, 61 వర్తించవచ్చని సూచించారు. అయితే కేవలం టైటిల్ వివాదాన్నే నేరంగా పరిగణించరాదని కూడా స్పష్టం చేశారు. సంబంధిత కమిషనర్ ద్వారా నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని, అవసరమైతే బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు. ట్రిబ్యునల్, హైకోర్టు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హెచ్ఎండీఏ అనుమతుల అసలు రికార్డులను పరిశీలించి, బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని, నైబర్ హుడ్ భూ యజమానులకు న్యాయం చేయాలని డీజీపీని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

