e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home హైదరాబాద్‌ నాడు నిరసనలు.. నేడు జల సిరులు

నాడు నిరసనలు.. నేడు జల సిరులు

 • కృష్ణా గోదావరితో విశ్వనగరికి జలాభిషేకం
 • ఏడేండ్లలో 20,611.6 కోట్ల్ల ఖర్చుతో 14 తాగునీటి ప్రాజెక్టులు
 • నీటి సరఫరా సామర్థ్యం 340 నుంచి 468 ఎంజీడీలకు పెంపు
 • భవిష్యత్తులో ఏ కష్టమూ రాకుండా భారీ జలాశయాలు
 • వందేండ్లకు భరోసానిచ్చే‘కేశవాపూర్‌’
 • కృష్ణా జలాల తరలింపు శాశ్వత ప్రాజెక్టుగా సుంకిశాల
 • ఆచరణలోకి వస్తున్న సీఎం కేసీఆర్‌ ఆలోచనలు

మొత్తం ఏడేండ్ల వ్యవధిలో రూ. 20, 611.6 కోట్ల ప్రాజెక్టులను చేపట్టి ప్రజలకు మెరుగైన నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకున్నది.తక్కువ సమయంలో ఎక్కువగా ఖర్చు చేయడం జలమండలి చరిత్రలోనే అరుదు అని, టీఆర్‌ఎస్‌ పాలనలో సంస్థ గణనీయంగా వృద్ధి సాధించిందని సినీయర్‌ ఇంజనీర్లు చెబుతుండడం గమనార్హం.
ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్యాలేదు.. ఒక్క రోజూ నీటి సమస్య ఉండవద్దు

ఓ సమీక్షలో సీఎం కేసీఆర్‌

రూ.10కోట్లు ఖర్చు అయినా ఫర్వాలేదు.. ఏ ఒక్క రోజు నగరానికి నీటి సమస్య ఉండొద్దు..ఎల్లంపల్లి రిజర్వాయర్‌ డేడ్‌స్టోరేజీ సమయంలో నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియలో భాగంగా సీఎం కేసీఆర్‌ అన్న ఈ ఒక్క మాట చాలు.. నగర తాగునీటి సమస్య పరిష్కారంలో చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలనే ప్రణాళికలతో ఉన్న ఆయన నీటి ఎద్దడి అనేది నగరాభివృద్ధికి ఏ మాత్రం ఆటంకంగా మారొద్దని నిరంతరం సీఎం కేసీఆర్‌ జలమండలి అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

- Advertisement -

నల్లా కనెక్షన్‌ లేని ఇంటి నుంచి రూపాయికే నల్లా కనెక్షన్‌..నెలకు 20 కిలో లీటర్ల ఉచిత నీటి పథకం వరకు ఒక సినీయర్‌ ఇంజనీర్‌గా మారి పాలనలో తనదైన ముద్ర వేశారు. అంతేకాకుండా దేశంలోని వివిధ మెట్రో పాలిటన్‌ నగరాలతో పోల్చితే హైదరాబాద్‌ మహానగరంలో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు సురక్షితమైనదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (జీఐఎస్‌) 10500 : 2012 నిబంధన ప్రకారం వరుసగా సర్టిఫికెట్స్‌ను ప్రధానం చేసింది.

నీరు లేకుండా పురోగతిని ఊహించలేం..

మానవ వికాసానికి నీరు జీవనాధారం. నీరు లేకుండా ఎటువంటి అభివృద్ధిని కానీ, పురోగతిని ఊహించలేం. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తెరిగింది. అందుకే నీటి వనరుల సంరక్షణపై ప్రత్యేక దృషి సారించింది. ఎంతో శ్రద్ధతో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, మహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రజలందరికీ నీటినందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. తాగునీటికి మొదటి ప్రాధాన్యతనిస్తూ.. సాగుతోపాటు పారిశ్రామిక రంగానికి తరువాతి స్థానాన్ని ఇచ్చాం.

ఈ క్రమంలో నగరవాసుల దాహార్తిని తీర్చడంలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయి అండ్‌ సీవరేజీ బోరు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌బీ) కీలకపాత్రను పోషిస్తున్నది. పెరుగుతున్న నీటి అవసరాలకు అనుగుణంగా నిర్వహణను చేపట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని తరలించి నగరవాసుల దాహార్తిని తీర్చడం. నగరంతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పరిధిలోని 190 గ్రామాలు, ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నది. – ముఖ్యమంత్రి కేసీఆర్‌

భవిష్యత్‌లోనూ నీటి సమస్య ఉండదు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరంలో ఇప్పుడు తాగునీటి సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు నగరంలో నీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు జలమండలి ప్రణాళికలు రచించింది. ప్రస్తుత పరిస్థితులు, జనాభాకు తగ్గట్లుగానే భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని 30 ఏండ్ల ముందు చూపుతో నగరానికి నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచింది. భవిష్యత్‌ తరాలకు నీటి కష్టాలు లేకుండా, మురుగునీటి సమస్యలు తలెత్తకుండా సివరేజీ మాస్టర్‌ప్లాన్‌ పనులు చకచకా జరుగుతున్నాయి.

కేటీఆర్‌ అంకుల్‌.. ప్లీజ్‌ నీళ్లు

సికింద్రాబాద్‌ దేవీనగర్‌కు చెందిన గాయత్రి అనే చిన్నారి ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ను నీటి సమస్యను దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో కేటీఆర్‌కు సదరు బాలిక వీడియోను ట్విట్‌ చేయగా, వెంటనే స్పందించిన కేటీఆర్‌ మరుసటి రోజు తెల్లవారేసరికి సమస్యను పరిష్కరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో

హుస్సేన్‌సాగర్‌ ద్వారా తాగునీటిని అందుకున్న చారిత్రక హైదరాబాద్‌ ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుక్కెడు నీటి కోసం నదుల వెంట పరుగులు తీసిన దుస్థితి. జంట జలాశయాల ద్వారా దశాబ్దాల పాటు నగరవాసులు దాహార్తిని తీర్చుకోగా… ఉమ్మడి పాలకులు పెరుగుతున్న నీటి అవసరాల కోసం సింగూరును ఆశ్రయించారు. అదీ చాలకపోవడంతో కృష్ణా వెంట పరుగులు పెట్టారు. ఆ తర్వాత వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తరలించారు. ఖైరతాబాద్‌ జలమండలి కేంద్ర కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు, కుండలతో ప్రతిపక్షాల నిరసన ప్రదర్శనలు, ధర్నాలు షరామామూలే. లాఠీచార్జీలు జరిగిన రోజులూ ఉన్నాయి. ఏదేని రోజు అనుకోని అవాంతరం ఎదురైతే హైదరాబాద్‌ గొంతు ఎండటం తప్ప ప్రత్యామ్నాయం లేదు.

స్వరాష్ట్రంలో…

తాగునీటి ప్రాజెక్టులు నిర్మించడమే కాదు… తరలించిన నీటిని సమర్థవంతంగా సరఫరా చేయడమనేది ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వం చేసింది అదే. సీఎం కేసీఆర్‌ ముందుచూపు, ప్రణాళికలు ఇప్పుడు హైదరాబాద్‌ నగరానికి పుష్కలమైన తాగునీటిని అందిస్తున్నాయి. మొన్నటిదాకా రోజుకు 340 మిలియన్‌ గ్యాలన్లుగా ఉన్న నగర నీటి సరఫరా సామర్థ్యాన్ని ప్రస్తుతం రోజుకు 468 మిలియన్‌ గ్యాలన్లకు పెంచారు. అంతేకాదు… విశ్వనగరమైన హైదరాబాద్‌కు భవిష్యత్‌లో ఒక్కరోజు కూడా తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు కేశవాపూర్‌లో గోదావరి జలాల భారీ నిల్వ సామర్థ్యంతో డెడికేటెడ్‌ రిజర్వాయర్‌ను కూడా నిర్మిస్తున్నారు. పైగా కృష్ణాజలాల సరఫరాలోనూ సుంకిశాల పథకంతో వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇబ్బందులు రాకుండా ముందుచూపు ప్రదర్శించారు. వెరసి… ఖాళీ బిందెల ప్రదర్శనలు పోయి ఉచితంగా నెలకు 20 వేల లీటర్ల సురక్షిత జలాలను అందుకునే స్థాయికి నగరవాసి చేరుకోవడం విశేషం.

2014 కంటే ముందు

 • రోజూ వారీ నీటి తరలింపు : 340 మిలియన్‌ గ్యాలన్లు
 • (ఉస్మాన్‌సాగర్‌ నుంచి 23 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్‌ 17, మంజీరా/ సింగూరు నుంచి120, కృష్ణా రెండు దశల ద్వారా 180 ఎంజీడీలు )
 • నల్లా కనెక్షన్లు మొత్తం : 7.5 లక్షల వినియోగదారులు
 • నెలవారీ రెవెన్యూ : రూ. 35 కోట్లు ప్రస్తుత సేవలు
 • కోర్‌ సిటీ 169.3 స్కేర్‌ కిలోమీటర్లు
 • శివారు మున్పిపాలిటీల వరకు 518.90 స్కేర్‌ కిలోమీటర్లు
 • ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు సేవల పరిధి 939.80స్కేర్‌ కిలోమీటర్లు మొత్తం సేవల పరిధి 1628 స్కేర్‌ కిలోమీటర్లు మేర నీటి సరఫరా అందిస్తున్నది.
 • రోజువారీ సరఫరా చేస్తున్న నీరు 468 ఎంజీడీలు (మిలియన్‌ గ్యాలన్‌ ఫర్‌ డే)
 • జలమండలి పరిధిలో మొత్తం నల్లా కనెక్షన్లు సుమారు 12 లక్షలు
 • నెలవారీ నిర్వహణ ఖర్చులు – రూ. 138 కోట్లు
 • నెలవారీ సంస్థ రాబడి రూ. 120కోట్లు స్వరాష్ట్రంలో సాధించిన లక్ష్యాలు
 • టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయా రిజర్వాయర్లలోని నీటి నిల్వలు సరిగా లేవు. అప్పటి వరకు కృష్ణా రెండు దశలల్లో 180, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల ద్వారా 50, సింగూర్‌, మంజీరాతో 120 ఎంజీడీల నీటిని నగరానికి తరలించారు. అయితే సింగూర్‌, మంజీరా, నగరంలోని జంట జలాశయాల్లోని నీరు అడుగంటి పోయి సుమారుగా 170 ఎంజీడీల నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే భగీరథ ప్రయత్నంగా కృష్ణా మూడో దశ ద్వారా 90 ఎంజీడీలు, గోదావరి తొలి విడత పథకం ద్వారా 100 ఎంజీడీల మేర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.
 • 2014 నవంబరు 2న మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రూ.338.54కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం ప్రాజెక్టుతో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంది.
 • 2015 నవంబరులో కృష్ణా మూడవ దశ ద్వారా 90ఎంజీడీలు, 2015 డిసెంబరులో గోదావరి ఫేజ్‌-1లో భాగంగా రోజూ 172 ఎంజీడీల్లో తొలి విడతగా 86 ఎంజీడీలు, ఆ తర్వాత మరో 86 ఎంజీడీలను నగరానికి తరలించి తాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టారు.
 • రూ. 1900కోట్లతో శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన తాగునీటి పథకం పనులను ఏడాదిలోనే పూర్తి చేశారు. దాదాపు 279 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో 56 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణ పనులు, 2200 కిలోమీటర్ల పైపులైన్‌ డిస్ట్రిబ్యూషన్‌ పైపులైన్‌ విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి సుమారు 40 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చారు.
 • ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాల్లోని ప్రజల క‘న్నీటి’ కష్టాలను తీర్చే లక్ష్యంలో భాగంగా అర్బన్‌ మిషన్‌ భగీరథలో రూ.756.41కోట్లతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2019జూలై నాటికి ఈ పథకం పూర్తి చేసి 190 గ్రామాలకు సమృద్ధిగా నీటిని అందిస్తున్నారు.
 • అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణ, పలుమార్లు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా వినియోగదారులకు మేలు చేశారు.
 • జూబ్లీహిల్స్‌లో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్కును ఏర్పాటు చేశారు.
 • డొమిస్టిక్‌ కనెక్షన్‌దారులకు 20కెఎల్‌ ఉచిత తాగునీటి పథకంతో 90 శాతం మంది వినియోగదారులకు లబ్ధి

రాబోతున్న కొత్త ప్రాజెక్టులు

 • ప్రస్తుతం కోటి ఉన్న జనాభా 4 కోట్లకు చేరినా తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో నగర దాహార్తికి శాశ్వత పరిష్కారంగా శామీర్‌పేట కేశవాపూర్‌లో రూ. 4777కోట్లతో భారీ స్టోరేజ్‌ రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టారు. కేశవాపూర్‌కు 18 కి.మీ దూరంలో ఉన్న కొండపోచమ్మ సాగర్‌ నుంచి 10 టీఎంసీల గోదావరి జలాలను ఈ రిజర్వాయర్‌కు తరలించనున్నారు.
 • ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం కృష్ణా, గోదావరి జలాలు కీలకంగా ఉండగా భవిష్యత్‌లో ఈ రెండు జలాశయాలలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ఆ ప్రభావం నగర తాగునీటిపై పడకుండా ఔటర్‌ రింగు రోడ్డు చుట్టూ భారీ రింగు మెయిన్‌ పైపులైన్‌ పనులు చేపట్టనున్నారు. ఔటర్‌ చుట్టూ కృష్ణా, గోదావరి పైపులైన్‌ వ్యవస్థలను అనుసంధానం చేస్తూ ఇంటర్‌ కనెక్టివిటీ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 158 కిలోమీటర్ల మొత్తంలో భారీ పైపులైన్‌, 12 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ. 4765.00కోట్ల అంచనాతో టాటా కన్సల్టెన్సీ డిటెల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
 • ఓఆర్‌ఆర్‌ లోపల కాలనీలకు మెరుగైన నీటి సరఫరా లక్ష్యంగా రూ. 1200కోట్లతో తాగునీటి పథకం పనులకు ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది.
 • పాతనగరంలో పురాతన తాగునీటి వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.
 • మంజీరా పైపులైన్ల తరచూ లీకేజీలకు శాశ్వత చెక్‌ పెడుతూ కొత్తగా పైపులైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు.
 • జలమండలి స్వంతంగా రిజర్వాయర్ల వద్ద సోలార్‌ రూప్‌టాప్‌లను ఏర్పాటు చేసి 31.12 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
 • 100శాతం సీవరేజీ ట్రీట్‌మెంట్‌ జరిపేందుకుగానూ రూ.3866.21 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా 31 మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
 • శివారు మున్సిపాలిటీల్లోని కాలనీల్లో సమృద్ధిగా నీటి సరఫరాకు గానూ రూ. 1200 కోట్ల తాగునీటి పథకానికి నిధులను మంజూరు చేసింది. ఒకే రోజూ రూ. 5,066.53కోట్లను కేటాయించడం పురపాలక శాఖ చరిత్రలోనే మొదటి సారి కావడం గమనార్హం. ఏడేండ్ల వ్యవధిలో దాదాపుగా జలమండలికి రూ. 10,707.06 కోట్లతో నిధులను కేటాయించి తాగు, మురుగునీటి వ్యవస్థలపై ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకున్నది.
 • 100శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా మూసీ పరివాహాక ప్రాంతం, కూకట్‌పల్లి నాలా వెంబడి 31 చోట్ల ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.3866.21 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు.
 • చౌటుప్పల్‌ సమీపంలో దేవులమ్మనాగారంలో మరో భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ నిర్మించాలన్న ఆలోచన ఉంది. ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
 • ముత్తంగి జంక్షన్‌ నుంచి కోకాపేట టౌన్‌షిప్‌ వరకు ఓఆర్‌ఆర్‌ వెంబడి రింగు మొయిన్‌ పైపులైన్‌ ప్రాజెక్టు రానుంది.
 • మెదక్‌ జిల్లా ఘన్‌పూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పటాన్‌చెరువు వరకు రూ. 422.80 కోట్లతో 45 కిలోమీటర్ల మేర 1800ఎంఎం సామర్థ్యం కలిగిన పైపులైన్‌ పనులను పూర్తి చేసి ఐటీ కారిడార్‌లో నీటి లభ్యతను పెంచారు.
 • రూపాయికే నల్లా కనెక్షన్‌ తీసుకువచ్చి లక్ష మంది బీపీఎల్‌ కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు.
 • సంస్థకు గుదిబండగా మారిన కరెంట్‌ బిల్లుల నుంచి ఉపశమనం కల్పించారు. మెట్రో తరహాలో విద్యుత్‌ రాయితీ పొంది సంస్థకు రూ.700 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు.
 • ఆయా రిజర్వాయర్ల నుంచి నగరానికి నీటి తరలింపు

రిజర్వాయర్‌ నీటి తరలింపు ఎంజీడీల్లో

కృష్ణా మూడు దశలు 273 ఎంజీడీలు
గోదావరి 167
ఉస్మాన్‌సాగర్‌ 18
హిమాయత్‌సాగర్‌ 10 468 ఎంజీడీలు
మిషన్‌ భగరథ కింద 50 ఎంజీడీలు, నగరంలో 418 ఎంజీడీలు తరలిస్తుండగా, 12 లక్షల మంది వినియోగదారులకు సమృద్దిగా నీటి సరఫరా చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement