ఉచిత శిక్షణిస్తూ.. స్ఫూర్తిగా నిలుస్తూ
ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు నరేశ్ యాదవ్. 2007 నుంచి తైక్వాండోలో శిక్షణను తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ..రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నో పథకాలు సాధించి తెలంగాణ కీర్తి
- అమ్మాయిలకు ఉచితంగా తైక్వాండో శిక్షణ
- యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నరేశ్ యాదవ్
జవహర్నగర్, జనవరి 6: ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు నరేశ్ యాదవ్. 2007 నుంచి తైక్వాండోలో శిక్షణను తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ..రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎన్నో పథకాలు సాధించి తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటాడు. అంతేకాదు బాలికలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు నరేశ్ యాదవ్.
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నరేశ్యాదవ్ తైక్వాండో నేర్చుకుని జాతీయ స్థాయిలో సిల్వర్ మోడల్ సాధించాడు. బాలికలు చిన్నప్పటి నుంచే తైక్వాండో నేర్చుకుంటే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని భావించిన నరేశ్ వారికి ఉచితంగా శిక్షణనిస్తున్నాడు. నేడు కార్పొరేషన్లోని 26వ డివిజన్ బాబాన్న కమిటీ హాల్లో శిక్షణ ఇస్తూ చిన్నారులను, యువతను ప్రోత్సహిస్తున్నాడు.
ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో..
ఇప్పటి వరకు ఎలాంటి సాయం లేకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో స్వయంగా పాల్గొంటూ పతకాలు సాధించాను. దాతలు, ప్రభుత్వం ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు మరిన్ని పతకాలు తీసుకొస్తాను.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

