పుస్తక పఠనం.. జ్ఞాన సాధనం
పుస్తక ప్రియుల కోసం మరో పండుగ వచ్చేసింది. ఎర్రమంజిల్ మెట్రోస్టేషన్ పక్కన నెక్ట్స్ ప్రీమియా మాల్లో ఆదివారం బుక్ ఫెయిర్ కొలువుదీరింది. ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది.
- ఎర్రమంజిల్‌లో పుస్తక పండుగ
- కితాబ్ లవర్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2 వరకు
- అందుబాటులో 10 లక్షల పుస్తకాలు
- ఉచితంగా రీడింగ్ కార్నర్
సిటీబ్యూరో, మార్చి 26 ( నమస్తే తెలంగాణ ) : పుస్తక ప్రియుల కోసం మరో పండుగ వచ్చేసింది. ఎర్రమంజిల్ మెట్రోస్టేషన్ పక్కన నెక్ట్స్ ప్రీమియా మాల్లో ఆదివారం బుక్ ఫెయిర్ కొలువుదీరింది. ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. కితాబ్ లవర్స్ ఆధ్వర్యంలో ‘లోడ్ ద బాక్స్’ థీమ్‌తో 9 రోజుల పాటు నగరంలో పుస్తక పరిమళాలు వీయనున్నాయి. అన్ని రకాల విభాగాల నుంచి సుమారు 10 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ సందర్భంగా కితాబ్ లవర్స్ ఫౌండర్ రాహుల్ పాండే మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పుస్తక ప్రియులు అత్యధికంగా ఉంటారని.. ఇక్కడ బుక్ ఫెయిర్ నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఐదేండ్లుగా కితాబ్ లవర్స్ పేరుతో బుక్ ఫెయిర్ నిర్వహించామని తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పుస్తక పఠనం చాలా తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలతో తల్లిదండ్రులు బుక్ ఫెయిర్‌ను సందర్శించాలని కోరారు. ఈ బుక్ ఫెయిర్‌లో ఉచితంగా రీడింగ్ కార్నర్ కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

