Photography Diploma | హిమాయత్‌నగర్, జూన్ 17: భాషా, సాంస్కృతిక శాఖ, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ రంగాల్లో ఆరు నెలల పాటు ‘ఆఫ్, ఆన్లైన్’లో ఉచితంగా డిప్లమా కోర్సుకు శిక్షణ ఇస్తున్నామని సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ చైర్మన్ ఏం.సి.శేఖర్ సోమవారం తెలిపారు.
ఫొటోగ్రఫీపై అభిరుచి గలవారు, వృత్తిగా స్వీకరించే వారికి ప్రాథమిక ఫొటోగ్రఫీతో పాటు పిక్టోరియల్ షూటింగ్ నైపుణ్యాలు, కంపొజీషన్, లైటింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ డిప్లమా కోర్సు శిక్షణ తరగతులు రవీంద్రభారతిలో జరుగుతాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెల్ నెం: 80080 21075, 70956 92175 లలో సంప్రదించి ఈ నెల 30వ తేదీలోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.