జూబ్లీహిల్స్, జనవరి18 : మెర్సీ మిషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్, రాంకీ ఫౌండేషన్, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉచిత మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహిస్తున్నారు.
నగరంలోని ఓల్డ్ మల్లేపల్లి సీతారాంబాగ్‌లోని డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్లో పక్షం రోజుల పాటు గ్రహణం మొర్రి, కాలిన గాయాలతో అవయవాలకు వచ్చిన వంకర్లు సరిచేయడం, జన్యుపర లోపంతో శరీరంపై వచ్చిన అవాంఛిత రోమాల నివారణకు ఉచిత ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించనున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు మువ్వ రాంరెడ్డి, విద్యాభూషణ్, డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ గులాబి రాణి, గద్దె భాస్కర్ తెలిపారు. వివరాలకు 78160 79234, 98482 41640 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.