చర్లపల్లి, మే 8: ప్రాచీన యుద్ద విద్య అయిన కరాటే (Karate) శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొవాలని హెచ్‌బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ అన్నారు. డివిజన్ పరిధిలోని చైతన్యనగర్ డబుల్ బెడ్రూం డిగ్నీటీ కాలనీలో భవాని షోటోకాన్ కరాటే అసోసియెషన్ అధ్యక్షుడు, గ్రాండ్‌మాస్టర్ పృద్వీకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గుండారపు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్ కళలో కరాటే ఒకటని, ప్రతి విద్యార్థి, విద్యార్థులు కరాటేను నేర్చుకొవాలని ఆయన సూచించారు. అనంతరం కార్పొరేటర్ ప్రభుదాస్, శ్రీనివాస్‌రెడ్డిలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు డీసీఎం.రాజు, కాలనీ నాయకులు బొడ నరేశ్, రమేశ్, విద్యసాగర్, సీతమహలక్ష్మి, పాల్రాజు, మహేశ్, ప్రభాకర్, చందు, కుమార్, లక్ష్మి, భారతి, మూర్తి, వెంకటేశ్‌లతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.