e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News హీరోల‌ను బోల్తాకొట్టించిన కిలాడి శిల్పా అరెస్టు

హీరోల‌ను బోల్తాకొట్టించిన కిలాడి శిల్పా అరెస్టు

హైద‌రాబాద్‌: టాలీవుడ్ హీరోల‌ను బోల్తా కొట్టించిన వ్యాపార‌వేత్త, సినీ నిర్మాత శిల్పా చౌద‌రీని పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కిలాడి శిల్ప వ‌ల‌లో మోస‌పోయిన వారిలో ముగ్గురు హీరోలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మోస‌పోయిన‌వారి జాబితాలో ఇంకా వ్యాపార‌వేత్త‌లు, ఫైనాన్షియ‌ర్లు, రియాల్ట‌ర్లు, లాయ‌ర్లు కూడా ఉన్నారు. డ‌బ్బులు తీసుకుని మోసం చేసిందంటూ శిల్ప‌పై పోలీసులకు బోల‌డ‌న్ని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్ర‌ముఖుల పేర్లు చెప్పి మ‌రీ శిల్ప మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సుమారు 200 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు అందాల్సి ఉంది.

పేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప వారి నుంచి భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూల్ చేసింది. సుమారు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు వారికి కుచ్చు టోపీ పెట్టిందామె. చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసిన‌ట్లు వార్త‌లు అందుతున్నాయి. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి శిల్ప కోట్లు వసూలు చేసింది. శిల్పతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. న‌ల్ల‌ధ‌నాన్ని మార్పిస్తాన‌ని, అధిక వ‌డ్డీ ఇస్తాన‌ని చెప్పి శిల్పి.. ప్ర‌ముఖుల్ని మోసం చేసింది. మోస‌పోయిన‌వారిలో చాలా మంది బాధితులు ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement