సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): ట్రేడింగ్ పేరుతో నగరవాసికి సైబర్ నేరగాళ్లు రూ. 13.42 లక్షలు టోకరా వేశారు. మారేడ్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి ఈఫ్యాన్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లోని లింక్ క్లిక్ చేయగానే కె66 యాప్‌లో ట్రేడింగ్ చేయండి, ఊహించని లాభాలు పొందండి అంటూ వచ్చిం ది. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ముందుగా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగా మంచి లాభాలు ఇచ్చారు. తరువాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టగా, లాభాలు స్క్రీన్‌పై చూపిస్తున్నా డబ్బులు డ్రా కావడంలేదు. మీ లాభాలు డ్రా కావాలంటే మరికొంత పెట్టుబడి పెట్టాలని, రూ. 13.42 లక్షల వరకు ట్రేడింగ్ పేరుతో మోసం చేశారు. బాధితుడు గురువారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు.
జూబ్లీహిల్స్‌కు చెందిన రామకృష్ణకు బిట్‌కాయిన్ ఇండియా సాఫ్ట్వేర్ సొల్యూషన్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. అందులో సూచించిన వెబ్సైట్లో రామకృష్ణ బిట్కాయిన్లు కొన్నాడు. ఒకటి రెండు సార్లు లాభాలు వచ్చాయి. పెట్టుబడి పెంచడంతో ఒక్కసారిగా రూ.8లక్షలు అకౌంట్‌ను బ్లాక్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.